Sunday, April 26, 2009

నేను -- నా బద్ధకం.

అసలే ఎండాకాలం .సీ. ఉన్నప్పటికీ ఏదో చిరాకుగా వుంది. మా అమరావతి కి రోజు 5:30 నుంచి 7:30 వరకు కరెంట్ ని తలారి ఉరిశిక్ష వేసినంత కటినంగా తీసేస్తాడు. కాని నాకు బద్ధకం వల్ల ఏమంత బాధగా వుండదు. కాని రోజు మాత్రం చాల చిరాకుగా పడుకున్ననాకు కరెంట్ పోగానే బాంబు పేలితే ఎంత వులిక్కి పడతామో అలా ఉదయాన్నే దోమలు బాగా కుడుతుంటే లేచి చూసా నా రక్తాన్ని మెరెండా తాగుతున్నట్టు తాగుతున్న దోమల్ని ఒక్కసారి విదిలించి బయటకి వెళ్లి బద్ధకంగా వొళ్ళు విరిచుకొని చూస్తే నేను ఎప్పుడు చూడని ఒక సీనరీ చూసా. అదే పొద్దున్నే వుండే ప్రకృతి అందం.నాకు చాలా ఆశ్చర్యం గా అనిపించింది. ఏమిటి ఇలా కూడా ప్రకృతి మాత వుంటదా? అని చిన్న కాదు కాదు పెద్ద డౌట్ వచ్చింది. నాకు ఇంకొక నెలలో సీ.. ఎగ్జామ్స్ అయినా కూడా .సీ. పెట్టుకొని లేట్ గా లేచే వాడిని కదా అందుకే అంత ఆశ్చర్యం.ఇంతలో




ఒకరు నా తలుపు తట్టారు.


నేను: ఎవరు మీరు?

అవతలి కంఠం : నేను ఎప్పుడు నీతో పాటే వుంటా నన్నే మరచి పోయావా?
నేను: క్షమించండి నాకు గుర్తు రావట్లేదు.

అవతలి కంఠం: నేనే నీ బద్దకాన్ని.

నేను : సారీ మరచిపోయా!





అని చాప, దిండు తెచ్చుకొని మా పెద్ద పెరటి లో ఒక మూల చతికిలపడ్డా కాని ఇక్కడో ప్రాబ్లం . అవే చీమలు అవి ఎక్కడెక్కడో కుడుతుంటే నాకు ఎక్కడెక్కడో కాలుతుంది. మళ్ళి లేచి నా చాపని,దిండుని,బద్దకాన్ని విదిలించి. ఒక చీపిరి తీసుకొచ్చి మొత్తం చిమ్మాను, హమ్మయ్య! అనుకోని మళ్ళి పడుకున్నా, మళ్ళి ఇంకొందరు ఎగిరే చుట్టాలు వచ్చారు మీరు వూహించినట్లే దోమలు. చెవిలో జుయ్ జుయ్ అని సౌండ్ చేస్తుంటే SAI-67 గన్ తీసుకొచ్చి చంపాలన్నంత కోపం వచ్చింది. కాని అలాంటివి లేకపోవటం వల్ల అవి బ్రతికిపోయి నా ప్రాణాలు తీస్తున్నాయి.తొందరగా కరెంట్ వస్తే బాగున్ను లోపలికి వెళ్లి పడుకోవచ్చు అనుకున్నా. కాని కాలం కలసి రాకపోతే దారానికి సూది లోకువ అన్నట్టు ( సారీ సామెత అంతగా సరి పోయినట్లు లేదు ఈసారికి ఇలా సరిపెట్టుకోండి.) కరెంట్ పీకేవాడు కూడా ఇవ్వాల్సిన సమయానికి ఇవ్వలేదు, కుక్క ఎంత అలెర్ట్ గా మాటిమాటికి లేచి యజమానిని చుసుకుంతుందో అంత అలెర్ట్ గా కరెంట్ వచ్చిందో లేదో చూసుకునే సరికి నా వొంట్లో ప్రాణం తుంట్లో కి వచ్చింది.ఇల్లు పెరటి కి కాస్త దూరమవడం వల్ల కరెంట్ వచ్చిందో లేదో తెలుసుకునే సరికి నా సగం బద్ధకం వదిలింది.ఇంతలో మంచి నిద్రలోకేల్లాను. అంతలోనే టింగ్ టింగ్ టింగ్ అని ఎవడో నవత డ్రైవర్ వచ్చి బెల్ కొట్టాడు ,నాన్న గుడికి వెళ్ళాడు రోజు శనివారం కదా! అమరావతి అమరేశ్వర స్వామీ కి అభిషేకం చేయిపిద్దామని వాడు అలా కొడుతుండే సరికి ముప్పావు బద్ధకం వదిలింది. వాడికి జ్వరమొచ్చ్చి డ్రైవింగ్ కి వెళ్ళటం లేదంట FAX పంపాలని వచ్చాడు. ఎలాగోలా నా సొంత తెలివి తేటలు యూజ్ చేసి చేసేసరికి మొత్తం బద్ధకం వదిలింది. వాడికి ఒక దణ్ణం పెట్టి నా బద్దకం వదిలించటానికి పరోక్షం గా సహాయం చేసినందుకు ఇంకో దణ్ణం పెట్టి.పోస్ట్ టైపు చేస్తున్నాను.ఇప్పుడు టైం ఎంతయ్యిందో తెలుసా? 8:25 ఏ.యం. .ఇంక వుంటానండి. మీతో మాట్లాడుతుంటే ఎంత సేపయినా వుండాలనిపిస్తుంది. కాని నేనింకా బ్రష్ చేసుకోలేదు. అయిన ఏమి ఫీల్ అవకండి. కాలమ్ ని ఎప్పుడు క్లిక్ చేస్తూ వుండండి .ఇలాంటి పోస్ట్ లు ముందు ముందు చాలా దర్శనం ఇస్తుంటాయి.

ఇట్లు మీ ఫ్రెండ్
Free Signature Generator

Free Signature Generator

0 comments:

Post a Comment

 

©2009 SOUJANYA | by TNB